సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:ఆంధ్రప్రదేశ్‌లో మందుబాబుల కు అధిక ధరలకు లిక్కర్ అమ్మకాల విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సీరియస్ అయ్యారు. ఈ మేరకు లిక్కర్ షాప్ యజమానులకు ఆయన వార్నింగ్ ఇచ్చారు. అధిక ధరలకు మద్యం విక్రయించడం నిబంధనలకు విరుద్ధం.. మద్యం దుకాణదారులు ప్రభుత్వానికి చెడ్డపేరు తేవద్దు అంటూ.. పవన్ కల్యాణ్ ఎక్స్ వేదికగా నేడు, మంగళవారం పోస్ట్ చేశారు. లిక్కర్ షాపుల్లో మద్యం బాటిళ్లు MRP కంటే ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నట్లు ఫిర్యాదు అందిందని.. ఇకనైనా జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించారు. కాకినాడ జిల్లాతోపాటు రాష్ట్రం నలుమూలల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని.. ఎక్సైజ్ శాఖ అధికారులు మద్యం దుకాణాలపై నిఘా పెట్టి.. అధిక ధరలకు విక్రయించే వారిపై చర్యలు తీసుకోవాలని పవన్ కల్యాణ్ ఆదేశించారు.
