సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, ఆదివారం అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలోని బాణసంచా తయారీ కేంద్రంలో నేటి మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య ఎనిమిదికి చేరింది. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి అగ్నిమాపక సిబ్బందితోపాటు పోలీసులకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలార్పుతోన్నారు. నేపథ్యంలో పీహెచ్సీలో చికిత్స పొందుతోన్న క్షతగాత్రులను మెరుగైన వైద్య చికిత్స కోసం విశాఖపట్నం కేజీహెచ్ ఆసుపత్రికి తరలించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.మరోవైపు ఈ ఘటనపై సీఎం చంద్రబాబు మాజీ సీఎం జగన్ కూడా తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
