సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మండలం అనకోడేరు L.V.N పురం గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు నేడు, శనివారం స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ శంకుస్థాపనలు చేసారు. స్థానికులను సమస్యలను అడిగి తెలుసుకొన్నారు. ముందుగా 31 లక్షల 72 వేల రూపాయలతో అనకోడేరు ఎస్సీ కాలనీ నందు మనబడి “నాడు నేడు” పేజ్ -2 లో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (స్పెషల్) అనకోడేరు అదనపు తరగతి గది మరియు కాంపోనెంట్స్ తో పాటు ప్రహరీ గోడ నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేసారు. తదుపరి 45 లక్షల రూపాయలతో అనకోడేరు జడ్.పి.హెచ్.ఎస్ నందు మనబడి “నాడు నేడు” పేజ్ -2లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అనకోడేరు 4 అదనపు తరగతి గదులు నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం చేసారు. మరో 16 లక్షల రూపాయలతో L.V.N పురం గ్రామంలో నూతన అంగన్వాడీ బిల్డింగ్ నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేసారు. వీటి పనులు కూడా అనుకున్న షెడ్యూలు లో ప్రారంభోత్సవాలకు అనుగుణంగా మంచి క్వాలిటీ తో పనులు త్వరితంగా పూర్తీ చెయ్యాలని అధికారులను, కాంట్రాక్టర్లు కు సూచించారు. సీఎం జగన్.. ప్రతి విద్యార్థికి విద్యను మించిన ఆస్తిలేదని చెప్పటమే కాదు కార్పొరేట్ స్కూల్స్ తో పోటీ పడే విధంగా ప్రభుత్వ స్కూళ్లను కోట్లాది రూపాయలు ఖర్చుతో ఆధునీకరిస్తున్నారని , ఉచిత విద్యను, మధ్యాహన భోజనం, ఉచిత యూనిఫామ్ దుస్తులు, షూస్, విద్య సామాగ్రి ఉచితంగా అందిస్తున్నారని, ఇది మన బాలలు చేసుకొన్నా అదృష్టం అని, మరి సీఎం జగన్ ఆశయాన్ని గుర్తించి పిల్లలు చక్కగా చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని తల్లితండులకు పిలుపు నిచ్చారు.
