సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఈ ఏడాది సంక్రాంత్రికి 7 సినిమాలు పోటీ పడుతుంటే .. పెద్ద సినిమా లేదు.. చిన్న సినిమా లేదు.. ఎవరిని తక్కువ అంచనా వెయ్యడానికి వీలులేని పరిస్థితి ఆయా చిత్రాల ట్రైలర్స్, టీజర్లు ను చూస్తుంటే అర్ధం అవుతుంది. నవీన్‌ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి హీరో హీరోయిన్‌లుగా నటించిన లేటెస్ట్ మూవీ ‘అనగనగా ఒక రాజు’. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూరి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి జనవరి 14న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమా తాజగా విడుదల చేసిన ట్రయిలర్ అంత భీమవరం బ్రాండ్ వెటకారంతో పంచ్ డైలాగ్స్, పంచ్ కామిడి సన్నివేశాలతో సినిమా ఫై అందరికి ఆసక్తి లేపే విధంగా రూపొందించారు. భీమవరం పోదామా అంటూ హీరో పోలిశెట్టి పాడిన పాట ఇప్పటికే బాగా ట్రెండ్ అవుతుంది. . రాజు గారి పెళ్లి చుట్టూ ఈ కథను అల్లుకున్నట్లు అర్థమవుతోంది. సంక్రాంతి పండక్కి తగ్గట్టుగా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ గా రూపొందినట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *