సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉండి నియోజకవర్గంలో వివిధ అనారోగ్య కారణాలతో బాధపడుతున్నపలువురు పేద వారికి వైద్య ఖర్చుల నిమిత్తం “ముఖ్యమంత్రి సహాయ నిధి” నుండి మంజూరైన రూ. 17,13,867/- సీఎంఆర్ఎఫ్ చెక్కులను స్థానిక ఎమ్మెల్యే రఘురామా కృష్ణంరాజు భీమవరం శివారులోని తన నివాసం లో నేడు, గురువారం లబ్ధిదారులకు అందజేశారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నాను. చెక్కు లు అందుకొన్న బాధితులు ఆయనకు కృతఙ్ఞతలు తెలిపారు. నా విజ్ఞప్తి మేరకు సకాలంలో బాధితులకు 17 లక్షలు పైగా ఆర్ధిక సహాయం అందజేస్తున్న సీఎం చంద్రబాబు కు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నానని ఎమ్మెల్యే రఘురామా అన్నారు.
