సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశీయ స్టాక్ మార్కెట్ లో ఇంకా అనిచ్చితి కొనసాగుతూనే ఉంది. నిన్నటి మాదిరిగానే నేటి గురువారం ఉదయం లాభాల్లో కదలాడిన దేశీయ సూచీలు మధ్యాహ్నం నష్టాల్లోకి ప్రవేశించాయి. క్రూడాయిల్ ధరలు ఏడు నెలల గరిష్ఠానికి చేరడం, ఎఫ్‌ఎమ్‌సీజీ, మెటల్, రియాల్టీ రంగాల్లో గరిష్ఠాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడం, వల్ల సూచీలు కిందకు దిగి వచ్చాయి.. దీంతో సెనెక్స్, నిఫ్టీ ఫ్లాట్‌గా రోజును ముగించాయి (Indian stock ). గత సెషన్ ముగింపు (82,276)తో పోల్చుకుంటే నేటి గురువారం ఉదయం దాదాపు 220 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత మరింత పైకి లేసింది.అయితే మధ్యాహ్నం తర్వాత అమ్మకాలు మొదలు కావడంతో మరల కిందకు దిగి వచ్చింది. చివరకు 27 పాయింట్ల నష్టంతో 82,248 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ 14 పాయింట్ల స్వల్ప లాభంతో 25,496 వద్ద స్థిరపడింది (stock market). బ్యాంక్ నిఫ్టీ 144 పాయింట్లు ఆర్జించింది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 392 పాయింట్లు లాభపడింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 90.91గా స్థిరంగా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *