సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అనిల్ రావిపూడివరుసగా 9 చిత్రాల విజయాలతో అందులో వెంకీ మామ కంబినేషన్స్ లో 4 సినిమాల బ్లాక్ బస్టర్స్ హిట్స్ తోఇటీవల చిరంజీవితో మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్ గారు తోఇటీవల భారీ హిట్ అందుకొన్నారు. ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) త‌ర్వాతి సినిమాపై స్వయంగా తాజగా అప్డేట్ ఇచ్చారు. రెండు నెల‌లుగా అనిల్ నెక్ట్స్ సినిమా గురించి సోష‌ల్‌మీడియాలో నటీనటుల గురించి ఓ రేంజ్‌లో చ‌ర్చ జ‌రుగుతుండ‌గా .. తానే స్వయంగా పోస్ట్ రిలీజ్ చేసారు. త్వ‌ర‌లోనే వెంక‌టేశ్ (Venkatesh ), క‌ళ్యాణ్ రామ్ ల‌తో క‌లిసి సినిమా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ‘తనకు తొలి 100 కోట్ల సినిమా ఇచ్చిన వెంక‌టేశ్‌, తొలి సినిమాపటాస్ తో ఛాన్స్ ఇచ్చిన క‌ల్యాణ్ రామ్ లీడ్ రోల్స్ లో ఈ సినిమా ఉంటుంద‌ని, వ‌చ్చే సంక్రాంతి కి ప్రేక్ష‌కుల ఎదుట‌కు ఈ సినిమాను తీసుకు వ‌స్తామ‌ని అధికారికంగా తెలుపుతూ, ఓ చిన్న గ్లిమ్స్ సైతం రిలీజ్ చేశారు. ఈ సినిమాలో వెంకటేష్ కు బావమరిది పాత్రలో కళ్యాణ్ రామ్ నటిస్తున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *