సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల గత మూడు సెషన్లలో భారీ నష్టాలను చవిచూసిన దేశీయ సూచీలు నేడు, మంగళవారం అనూహ్యంగా లాభాల వైపు దూసుకొనిపోయాయి. దీనికి పలు ఆసియా సూచీలు లాభాల్లో కొనసాగడం కలిసొచ్చింది. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ లాభాలతో రోజును ముగించాయి. గత సోమవారం ముగింపు (80, 891)తో పోల్చుకుంటే నేడు, మంగళవారం ఉదయం నష్టాలతో మొదలైన సెన్సెక్స్ మధ్యాహ్నం వరకు నష్టాల్లోనే ఉగిసలాడింది. అయితే మధ్యాహ్నం తర్వాత మదుపర్లు కొనుగోళ్లకు దిగడంతో సెన్సెక్స్ పుంజుకుంది. ఇంట్రాడే కనిష్టం అయిన 80, 575 నుంచి దాదాపు వెయ్యి పాయింట్లు ఎగబాకి 81, 429 వద్ద గరిష్టానికి చేరుకుంది. చివరకు సెన్సెక్స్ 446 పాయింట్ల లాభంతో 81, 337 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ 140 పాయింట్ల లాభంతో 24, 821 వద్ద రోజును ముగించింది.సెన్సెక్స్‌లో టాటా కెమికల్స్, బిర్లాసాఫ్ట్, గ్రాన్యుయల్స్ ఇండియా, వరుణ్ బేవరేజెస్, అంబర్ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు లాభాలు ఆర్జించాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 465 పాయింట్లు లాభపడింది. బ్యాంక్ నిఫ్టీ 137 పాయింట్లు లాభపడింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 86.81గా నిలబడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *