సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, బుధవారం రాయకుదురు గ్రామంలో అన్నదాత సుఖీభవ – పిఎం కిసాన్ పథకం పశ్చిమ గోదావరి జిల్లా రైతులకు నిధుల విడుదల కార్యక్రమంలో కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, టిడిపి పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ గాంధీ పాల్గొన్నారు. కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలో 1,03,761 మంది రైతుల ఖాతాలలో రెండో విడతగా రూ 68.97 కోట్లు జమా, చేస్తున్నామన్నారు. జిల్లాలో నియోజక వర్గాల వారిగా ఆచంట 19,175 మంది రైతులకు రూ 13.30 కోట్లు, భీమవరం 8,335 మందికి రూ 5.68 కోట్లు, నరసాపురం 11,965 మందికి రూ 7.63 కోట్లు, పాలకొల్లు 14,458 మందికి రూ 8.91 కోట్లు తాడేపల్లిగూడెం 18,361 మందికి రూ 12.14 కోట్లు, తణుకు 16,854 మందికి రూ 11.51 కోట్లు, ఉండి 9,629 మందికి రూ 6.61 కోట్లు, గణపవరం మండలంలో 4,884 మందికి రూ 3.19 కోట్లు మొత్తం జిల్లాలో 1,03,761 మంది రైతులకు రూ 68.97 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాలకు జమ కానున్నాయన్నారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ.. ఒక్కో రైతు ఖాతాలో కేంద్రం వాటా రూ2 వేలు, రాష్ట్ర వాటా రూ 5 వేలు చొప్పున మొత్తం రూ7 వేలు జమ చేయడం జరుగు తుందన్నారు. తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా రెండవ విడత 46,87,838 రైతులు రూ 3,135 కోట్లు ప్రభుత్వం అందిస్తుందని, ఇది రైతులకు మరో అతి పెద్ద పండుగ అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *