సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అన్నవరం సత్యదేవుడి దివ్య కల్యాణోత్సవ ఏర్పాట్లపై పెద్దాపురం ఆర్డీవో సీతారామారావు అధ్యక్షతన ఈవో రామచంద్రమోహన్ వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. స్వామివారి దివ్య కల్యాణోత్సవాలు మే 18న ప్రారంభమై 24 వరకు జరగనుండగా 19 రాత్రి వార్షిక కల్యాణ వేదికపై అంగరంగవైభవంగా సత్యదేవుడి కల్యాణం జరగనుంది. ముఖ్యంగా 19 రాత్రి జరిగే కల్యాణోత్సవాలపై వివిధ శాఖల అధికారులకు ఆర్డీవో ప్రణాళిక నిర్ణయించారు. . ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈ ఏడాది కల్యాణాలకు ప్రముఖులు, రాజకీయ నాయకులు వచ్చే అవకాశం లేకపోవడంతో సిఫార్స్ లేఖలు లేకపోవడంతో సామాన్య భక్తులకు మరింత సౌకర్యవంతమైన దర్శనం, చేయించవచ్చునని అన్నారు. స్వామివారి . కల్యాణం వీక్షించేందుకు సుమారు 15 వేలమంది భక్తులు విచ్చేసే అవకాశం ఉందని కల్యాణ వేదిక ఎదురుగా ప్రత్యేక గ్యాలరీలు, దూరం నుంచి వీక్షించే వారి కోసం ఎల్ఈడీ స్ర్కీన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కల్యాణం రోజున సాయంత్రం 4గంటల నుంచి భారీ వాహనాలను కొండపైకి అనుమతించకుండా కార్లు, బైక్లను అనుమతించాలని నిర్ణయించారు.
