సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అనంతపురం ‘సూపర్ సిక్స్‘ అమలు.. బహిరంగ సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. 2024 ఎన్నికలు చరిత్రను తిరిగరాశాయని అన్నారు. . ఈ సభ రాజకీయాలు, ఓట్లు కోసం కాదని.. 15 నెలలలో ఇచ్చిన మాట అన్ని హామీలు నిలబెట్టున్నామని చెప్పేందుకే ఈ సభను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.గత పాలకులు ప్రజా వేదికను కూల్చివేతతో విధ్వంసం మొదలు పెట్టి రాష్ట్రాన్ని అగాధంలోకి నెట్టిందన్నారు. అవినీతి అక్రమాలు, అప్పులు, తప్పుడు కేసులతో రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని విమర్శించారు. నేపాల్ దేశంలో ఆందోళనలు జరుగుతున్నాయని.. అక్కడ మన తెలుగువాళ్లు 200 మంది చిక్కుకు పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వారిని స్వస్థలాలకు తిరిగి తీసుకురావడానికి మంత్రి లోకేశ్‌కు బాధ్యతలు అప్పగించామని చెప్పారు. వచ్చే దసరా పండుగ కు ఆటో మిత్ర కింద ఆటో డ్రైవర్లకు రూ. 15 వేలు ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు. రైతన్నకు అండగా ఉండేందుకే అన్నదాత సుఖీభవ పథకం తీసుకు వచ్చామని వివరించారు. కేంద్రంతో కలిసి ఏడాదికి మూడు విడతల్లో రూ. 20 వేలు ఇస్తామన్నారు. తొలి విడతగా ఇప్పటికే రూ.7 వేలు ఇచ్చామని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *