సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్; అలా మొదలయింది పేమ్.. నందిని రెడ్డి దర్శకత్వంలో చాలామంది సీనియర్ నటులు రాజేంద్ర ప్రసాద్, నరేష్, రావు రమేష్, గౌతమి, షావుకారు జానకి లాంటి వాళ్ళు నటించిన ‘అన్నీ మంచి శకునములే‘ ఈరోజు శుక్రవారం విడుదల అయింది. సంతోష్ శోభన్, మాళవిక నాయర్ లీడ్ పెయిర్. స్వప్న, ప్రియాంక దత్ లు ఈ సినిమాకి నిర్మాతలు, ఇంతకీ ఈ సినిమా కథ విషయానికి వస్తే ..ఈ కథ ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు బోర్డర్ దగ్గర విక్టోరియా పురం అనే వూరిలో జరిగింది. దివాకర్ (రావు రమేశ్), సుధాకర్ (సీనియర్ నరేష్) అన్నదమ్ములు ఒక కుటుంబం. అలాగే ప్రసాద్ (రాజేంద్ర ప్రసాద్) ఇంకో కుటుంబానికి యజమాని. ఈ రెండు కుటుంబాల కొన్ని దశాబ్దాలకు పనిగా ఒక కాఫీ ఎస్టేట్ గురించి కోర్టు కేసులు నడుస్తూ ఉంటాయి. రెండు కుటుంబాలు పంతానికి పోయి తరాలు మారినా, ఈ కోర్టు కేసు మాత్రం వదలరు. ఇదిలా ఉంటే ప్రసాద్ కొడుకు రిషి (సంతోష్ శోభన్) సుధాకర్ కూతురు ఆర్య (మాళవికా నాయర్) ఇద్దరూ ఒకటే స్కూల్ లో చదువుతూ అప్పటి నుండే ప్రేమలో పడతారు. రెండు కుటుంబాలకు పడకపోయినా ఈ ఇద్దరూ రెండిళ్లకు వస్తూ పోతూ వుంటారు, అయితే కోర్ట్ కేసులో ఎవరు గెలిచారు, రిషి, ఆర్యలు మ్యారేజ్ చేసుకున్నారా? వీటన్నటికీ సమాధానాలు కావాలంటే సినిమా చూడాల్సిందే. ఇక సినిమా ఎలా ?తీశారు అంటే.. ‘అన్నీ మంచి శకునములే’ సినిమా కథ చాలా చిన్నది, అందుకని నందిని అది చెప్పడానికి కొంచెం సాగదీసింది. మొదటి సన్నివేశాలు చూస్తున్నప్పుడు ప్రేక్షకుడికి ‘అల వైకుంఠపురంలో’ సినిమా గుర్తుకు వస్తుంది. ఎక్కడా ట్విస్ట్స్ కూడా వుండవు. హీరోయిన్ మాళవిక నటన చాల బాగుంది. షావుకారు జానకి చాలాకాలానికి కనపడి అలరించారు. అందరు సీనియర్ నటులు బాగా చేసారు. చివరి 20 నిముషాలు మాత్రం ఈ సినిమాకి ఆయువుపట్టు అని చెప్పాలి. ముఖ్యంగా ఆసుపత్రిలో రాజేంద్ర ప్రసాద్ తో, రావు రమేష్ చెప్పిన ఆ డైలాగ్స్ హృదయాన్ని హత్తుకుంటాయి.మిక్కీ జె మేయర్ సంగీతం సాఫ్ట్ గా వుంది, నేపధ్య సంగీతం ఇంకా బాగుంది’అన్నీ మంచి శకునములే’ మంచి ఫీల్ గుడ్ సినిమానే, కాకపోతే చాలా స్లోగా ఉంటుంది
