సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆహా వేదిక‌గా నంద‌మూరి బాల‌కృష్ణ‌ హోస్ట్‌గా వ్య‌హ‌రిస్తున్న అన్‌స్టాప‌బుల్ షో కు దేశంలో OTTలో నెంబర్ 1 రేటింగ్ ఉన్న విషయం అందరికి తెలిసిందే. ఇప్పటికే మూడు సీజ‌న్లు పూర్తి కాగా ప్ర‌స్తుతం నాలుగో సీజ‌న్ న‌డుస్తోంది. ఇప్ప‌టికే ఆరు ఎపిసోడ్స్ ప్రేక్ష‌కుల ముందుకు రాగా ఇక ఏడో ఎపిసోడ్‌లో వెంకీమామ సంద‌డి చేయ‌నున్నాడు. నేడు, ఆదివారం హైద‌రాబాద్‌లోని అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో నేడు (ఆదివారం) ఈ ఎపిసోడ్ షూటింగ్ జ‌రుగుతోంది. ఇప్ప‌టికే బాలయ్య తో సహా వెంకీ, అనిల్ రావిపూడి స్టూడియోకి చేరుకోగా ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. విక్టరీ వెంక‌టేష్ న‌టిస్తున్న ‘సంక్రాంతికి వ‌స్తున్నాం‘. F2. F3 ల సూపర్ హిట్స్ తరువాత అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కింది సంక్రాంతి కానుక‌గా 2025 జ‌న‌వ‌రి 14న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. మరో పక్క జనవరి 12న బాలయ్య ‘డాకు మహారాజ్’ కు పోటీగా వస్తుంది. మరి వెంకిమామ తో బాలయ్య అట, మాట సందడి జనవరి లో ఆహా లో చూసే అవకాశం ఉంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *