సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత దేశ సినీ చరిత్ర లో అద్భుతమైన నటుడు, హీరో ఎవరంటే .. ఎవరి నోటా నుండి అయినా టక్కున వచ్చే సమాధానం కమల్ హాసన్.. వీడు కమల్ హాసన్ ను మించేలా యాక్ట్ చేస్తున్నాడురా! అన్నది తెలుగులో వాడుక పదం అయిపొయింది. నేడు, ఆదివారం కమల్ హాసన్ తన 67వ జన్మదినం జరుపుకొంటున్నారు. బాలనటుడిగా సినీ పరిశ్రమలో ప్రవేశించిన కమల్ సినీ జీవితం సుమారు 60 ఏళ్ళు అంటే ఎవరు నమ్మలేరు. ఇప్పటికి హీరోగా తనకు తిరుగు లేదని “విక్రమ్” వంటి బ్లాక్ బ్లాస్టర్ హిట్ తో నిరూపించుకోవడం అంటే.. అతడు ఇప్పటివరకు పడింది, మాములు కష్టం కాదు.ఎంతో నష్టపోయాడు, అయితే వయస్సు పెరుగుతున్న అదే ఫిట్నెస్ తో ఉన్నాడు. తాను పోషించే పాత్రే తెరపై కనిపించాలని ఎంతటి త్యాగానికైనా తపించే ఉత్తమ నటుడు కమల్ హాసన్. బాలచందర్ , కే విశ్వనాధ్ లు తాన గురువులుగా ప్రకటించుకునే కమల్ ఎన్నో అద్భుత కళాకండాలు లాంటి చిత్రాలు నటించారు, నిర్మించారు. పాటలు పాడారు, కధలు, మాటలు, నృత్యాలు సమకూర్చారు. తెలుగులో ఏ ఎన్ ఆర్ , కృష్ణంరాజు సినిమాలకు డాన్స్ మాస్టర్ గా 17వయస్సులోనే పనిచేసారు. తెలుగులో , మరోచరిత్ర,ఎర్ర గులాబీలు , సొమ్ము వకడిది సోకకడిది.. సాగరసంగమం,స్వాతి ముత్యం, శుభ సంకల్పం, నాయకుడు ,ద్రోహి, క్షత్రియ పుత్రుడు,ఇంద్రుడు చంద్రుడు.. భారతీయుడు , బామానే సత్యభామనే , హేరామ్, ఈనాడు ,దశావతారం, విశ్వరూపం వంటి ఎన్నో హిట్స్ అందించిన కమల్ హాసన్ మరిన్ని చిత్రాలలో ప్రేక్షకులను అలరించాలని కోరుకొంటూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాము.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *