సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నారాయణపురం నుండి నేడు, మంగళవారం ఉదయం పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రవేశించిన సీఎం జగన్ బస్సు యాత్ర గణపవరం ఉండి మీదుగా భీమవరం వరకు కేవలం 22 కిమీ దూరంలోపు చేరుకోవడానికి 6గంటల పైగా సమయం పట్టింది. కనీవినీఎరుగని రీతిలో రోడ్లకు కిరువైపులా అడుగడుగునా మహిళలతో సహా భారీజనసంద్రంతో వైసీపీ క్యాడర్ ఘనస్వాగతాలతో నిండిపోయింది. ఈ ఘన స్వాగతానికి సీఎం జగన్ తబ్బిఉబ్బి అయ్యిపోయారు. దీని ప్రభావంతో భీమవరం లో గ్రంధి వెంకటేశ్వర రావు కాలేజీ గ్రౌండ్ లో జరిగిన గతంలో సిద్ధం సభలకు ఏ మాత్రం తీసిపోని రీతిలో సుమారు లక్ష మంది ప్రజలు పాల్గొన్న భారీ బహిరంగ సభలో గంటకు పైగా సుదీర్ఘ ప్రసంగాన్ని ఇటీవల కాలంలో ఎక్కడ ప్రసంగించని రీతిలో చంద్రబాబు పవన్ లపై సరికొత్త పంచ్ లతో అభిమానులను ఉత్సహపరిచారు. సీఎం జగన్ చివరలో భీమవరం అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ ను రియల్ హీరోగా మరోసారి పేర్కొనగానే సభలో ఒక కొత్త జోష్ వచ్చింది. ఇక్కడ శీనన్న ఎన్నో మంచి పనులు చేసారు. ఈసారి శ్రీనన్న తో భీమవరం కు మరిన్ని మంచి పనులు చేయించే బాధ్యత తీసుకొంటాను.అంటూ పలుమారులు గ్రంధి శ్రీనివాస్ బుజం తట్టారు. జిల్లా లో పోటీ చేస్తున్న అందరి వైసీపీ అభ్యర్థులను సభకు పరిచయం చేసారు. ఎంపీ అభ్యర్థిగా గూడూరి ఉమాబాలను, అభ్యర్థులు అందరిని కూడా భారీ మెజారిటీ తో గెలిపించాలని విజ్ఞప్తి చేసారు. సీఎం జగన్ చివరలో తనకు మద్దతుగా సెల్ ఫోన్ లైట్ లు వెయ్యండని కోరినప్పుడు సభ ప్రాంగణం అంతా వెలుగులతో నిండిపోయింది. ఈ సభ ప్రాంగణంలో విశేషంగా మహిళలు విద్యార్థినిలు పాల్గొనడం గమనార్హం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *