సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో కూటమి పాలన ప్రారంభించినేడు,బుధవారం ఏడాది పూర్తీ అయిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. దానిలో.. ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జూన్ 4.. చరిత్ర సృష్టించిన రోజు.. ప్రజావిప్లవానికి నియంత పాలకులు కొట్టుకుపోయిన రోజు.. అధికారం పేరుతో ఊరేగిన ఉన్మాదాన్ని ప్రజలు తరిమికొట్టిన రోజు… సైకో పాలనకు అంతం పలికి.. ప్రతి పౌరుడూ స్వేచ్ఛ, ప్రశాంతత పొందిన రోజు.. ఉద్యమంలా ప్రజలు ఓట్లేసి తిరిగి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టిన రోజు.. పసుపు సైనికుల పోరాటాలు, జనసైనికుల ఉద్యమాలు, కమలనాథుల మద్దతుతో రాష్ట్రం గెలిచిన రోజు.. అని సీఎం చంద్రబాబు అభివర్ణించారు.‘ఏడాది క్రితం ప్రజలు ఇచ్చిన అధికారాన్ని రాష్ట్ర పునర్నిర్మాణ బాధ్యతగా భావించి ప్రతి రోజూ పనిచేస్తున్నాం. పాలనను గాడిన పెట్టి…సంక్షేమాన్ని అందిస్తూ… అభివృద్ధిని పట్టాలెక్కించాం. రాష్ట్ర దశ, దిశను మార్చేందుకు ఇచ్చిన ఏకపక్ష తీర్పునకు ఏడాది పూర్తయిన సందర్భంగా నాటి విజయాన్ని గుర్తుచేసుకుంటూ ప్రజలకు శిరసు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. వచ్చే నాలుగేళ్లలో మరెన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని మాట ఇస్తున్నాం’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. కూటమి శ్రేణులకుధన్యవాదాలు తెలిపారు.
