సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మండలం గూట్లపాడు గ్రామానికి చెందిన పచ్చిపాల అభిషేక్ వైద్యానికి రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షలతో కూడిన ఎల్ఓసిని మంజూరు చేసింది. కాగా నేడు, బుధవారం స్థానిక క్యాంప్ కార్యాలయంలో ఈ ఎల్ ఓ సి ని అభిషేక్ తండ్రి మొరార్జీకి ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ చేతులమీదుగా అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వైయస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని దాదాపుగా మూడు వేల పైచిలుకు వ్యాధులకు విస్తరింప చేశారని, అంతేగాకుండా ఈ పథకాన్ని మన రాష్ట్రంలోని పలు కార్పొరేట్ ఆసుపత్రులతో పాటుగా, ఇతర రాష్ట్రాల్లో కూడా ఎంపిక చేసిన కార్పొరేట్ ఆసుపత్రులలో అమలు చేస్తున్నారని అన్నారు. అదే మాదిరిగా వైయస్సార్ ఆరోగ్యశ్రీ పథకంలో లేని వ్యాధులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద నిధులు మంజూరు చేసి వైద్యానికి పెద్దపీట వేశారని అన్నారు. ప్రజలకు మరింత అందుబాటులో వైద్యం ఉండే విధంగా వైయస్సార్ హెల్త్ క్లినిక్ లను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. 104 వాహనం ద్వారా గ్రామాలలో ఎప్పటికప్పుడు ప్రజలకు వైద్య సేవలను అందిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో, వైయస్సార్ సేవాదళ్ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు గా నియమితులుఅయిన చిన్నమిల్లి వెంకటరాయుడు, ఎంపీపీ పేరిచర్ల విజయ నరసింహ రాజు, ఏఎంసీ మాజీ చైర్మన్ తిరుమాని ఏడుకొండలు,ఫిలిప్పీన్ తదితరులు పాల్గొన్నారు.
