సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఈ రోజు టీడీపీ జనసేన మొదటి విడుత 99 మంది అభ్యర్థుల ( వీటిలో జనసేన అయిదుగురు) ప్రకటించాక పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. జనసేన ఈ ఎన్నికలలో 24 సీట్లు లో మాత్రమే పోటీ చేస్తుందని అభిమానులు బాధపడొద్దని 3 ఎంపీ సీట్లలో కూడా పోటీ చేస్తున్నామని వాటిలో ఉండే నియోజకవర్గాలతో కలపి 40 కి పైగా స్థానాలలో మన అభ్యర్థుల పోటీ ఉంటుందని వివరించారు. ఇక చంద్రబాబు మాట్లాడుతూ.. తానెప్పుడూ ఇంతలా అభ్యర్థుల జాబితా విషయంలో కసరత్తు చేయలేదని అన్నారు, రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి 10 లక్షల మంది నుంచి అభిప్రాయ సేకరణ జరిపానన్నారు. టీడీపీ లో ఇంత పెద్ద లిస్ట్ ఇవ్వడం ఇదే మొదటిసారి అని పేర్కొన్నారు. విన్నింగ్ హార్స్‌లను , పార్టీ అంటే కమిట్మెంట్ ఉన్న వాళ్లకు కొంతమందికి ఇవ్వలేకపోయారన్నారు. వారందరినీ పిలిపించి మాట్లాడుతానన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే టికెట్ కేటాయించని అభ్యర్థులందరికీ పదవులు కూడా ఇస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. బీజేపీతో పొత్తు విషయం చర్చలు జరుగుతున్నాయన్నారు. వైసీపీ ఇన్‌చార్జిలు, సమన్వయకర్తలను మాత్రమే ప్రకటించిందన్నారు.తాము మాత్రం టీడీపీ నేరుగా అభ్యర్థులను ప్రకటించిందని చంద్రబాబు అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *