సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకొని భీమవరం పట్టణ తెలుగుదేశంపార్టీ ఆధ్వర్యంలో స్థానిక పట్టణ పొట్టి శ్రీరాములు విగ్రహానికి టిడిపి నాయకులు పూలమాలలు వేసి ఘననివాళి అర్పించారు. ఈసందర్భంగా భీమవరం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ పోలీట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ.. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కొరకు అమరణ నిరాహారదీక్ష చేసి అమరుడైన పొట్టి శ్రీరాములు తెలుగువారి ఆరాధ్య దైవమన్నారు. టిడిపి రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి మాట్లాడుతూ.. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం పొట్టి శ్రీరాములు 1952 సంవత్సరం అక్టోబర్ 19 వ తేదీన ప్రారంభించిన అమరణ నిరాహారదీక్ష 58 రోజులు కొనసాగించి వారి ప్రాణత్యాగం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి కీలక నేతలు కోళ్ల నాగేశ్వరరావు , గనిరెడ్డి త్రినాథ్ ,మద్దుల రాము చెల్లబోయిన గోవింద్, ఉప్పులూరి చంద్రశేఖర్, పామర్తి వెంకటరామయ్య ఎండి షబీనా మాదాసు,మైలబత్తుల ఐజాక్ బాబు, చెల్లబోయిన సుబ్బారావు టిడిపి నాయకులు ఏద్దు ఏసుపాదం పొత్తూరి బాపిరాజు గునుపూటి తిరుపాల్ తుంపూడి వెంకటకృష్ణగుప్త ఎండి నౌషాద్ విజ్జురోతు రాఘవులు సయ్యద్ నసీమా బేగం గంధం రాధా నక్క లక్ష్మి నీలాతి రమేష్ గొలగాని రమేష్ పాలా శ్రీరామదాసు, పడమట నరసింహమూర్తి పాల వెంకట రామకృష్ణ, విరవల్లి మహేశ్వరరావు మల్లువలస రాము నల్లం గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *