సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎట్టకేలకు ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి (Amaravati)కి రాజధాని నిర్మాణానికి రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంక్ ఆమోదముద్ర వేసింది. రూ. 6 వేల 750 కోట్లు రుణం ఇచ్చేందుకు బ్యాంక్ పాలకవర్గం అంగీకరిస్తూ రుణం మంజూరు చేసినట్లు ఏపీ ప్రభుత్వానికి తాజగా ఆమోదం తెలిపింది. గతంలోనే అమరావతి కోసం రూ. 6 వేల 850 కోట్లు రుణం ఇచ్చేందుకు ఆసియా అభివృద్ధి బ్యాంకు ఆమోద ముద్ర వేసిన విషయం తెలిసిందే. విడతలు వారీగా ఈ రెండు బ్యాంకులు కలిపి మొత్తం రూ.15 వేల కోట్లు రుణం ఇచ్చేందుకు అంగీకారం తెలిపాయి. హడ్కో నుంచి జర్మన్ బ్యాంక్‌తో కలిపి మరో రూ.16 వేల కోట్లు రుణం అందనుంది. హడ్కో పనులకు వెంటనే ప్రభుత్వం టెండర్లుకు పిలవనుంది. సంక్రాంతి తరువాత అమరావతి భవన నిర్మాణ పనులు ప్రారంభం చెయ్యడానికి చంద్రబాబు సర్కార్ సిద్ధంగా ఉంది.
