సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ రాజధానిగా అమరావతి నిర్మాణ పనులు పునఃప్రారంభానికి నేడు శుక్రవారం ప్రధాని మోడీ చేతులమీదుగా మరోసారి అంకురార్పణ చేస్తున్నకార్యక్రమానికి పశ్చిమ గోదావరి జిల్లా నుండి పెద్ద ఎత్తున కూటమి నేతలు. టీడీపీ క్యాడర్ తరలి వెళుతున్నారు. ఇప్పటికే అధికారులు జిల్లాలోని ఏ పట్టణం నుంచి ఏ వాహనం, ఏ సమయంలో బయలు దేరుతుందో, తిరిగి, ఏ సమయానికి స్వస్థలాలకు చేరుకుంటామో అనే సమాచారాన్ని షెడ్యూలు అందించారు. భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, నర్సాపురం, ఉండి, ఆచంట నియోజక వర్గాల నుంచి భారీ సంఖ్యలో వాహనాలు ఏర్పాటు చేసారు. మంత్రి నిమ్మల రామానాయుడు పాలకొల్లు నుంచి ప్రధాని సభకు 25 బస్సులు, 120 కార్లతో ఐదు వేల మందికిపైగా తరలి వెళుతున్నట్టు తెలిపారు. ఉండి ఎమ్మెల్యే రఘరామకృష్ణరాజు, భీమవరం ఎమెల్య అంజిబాబు తమ నియోజకవర్గాల నుండి పెద్దఎత్తున ఏర్పాట్లుచేశారు. జిల్లా నుంచి 150 బస్సుల్లో ప్రజలు తరలి వెళ్లే లా ఏర్పాటు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 2 విధాలుగా అమరావతి సభ కు నేటి మధ్యాహ్నం 2 గంటలకల్లా చేరుకునేలా ఏర్పాటు చేసారు. తాడేపల్లిగూడెం, తణుకు, ఆచంట నియోజకవర్గాల నుంచి ప్రజలు గన్నవరం మీదుగా వెళ్లేలా ఏర్పాటు చేశారు. భీమవరం పాలకొల్లు, నర్సాపురం ఉండి నియోజకవర్గాల ప్రజలు ఉయ్యూరు మీదుగా అమరావతి చేరుకుంటారు. ప్రతీ వాహనంలోను మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉండేలా చూసుకున్నారు. నేటి రాత్రి 8 గంటల కల్లా వాహనాలు గమ్య స్థానాలకు చేరుకునేలా షెడ్యూలు పెట్టుకొన్నారు.
