సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ కు అమరావతిని ఏకైక అధికారిక రాజధానిగా సుస్థిరపరిచే దిశలో చంద్రబాబు సర్కార్ వేగంగా అడుగులు వేస్తోంది. కేవలం రాష్ట్ర స్థాయిలోనే కాకుండా, కేంద్ర ప్రభుత్వం ద్వారా అమరావతికి తిరుగులేని చట్టబద్ధత కల్పించడమే లక్ష్యంగా రాజధానికి సంబంధించి ప్రత్యేక బిల్లును నేడు, శనివారం రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం అయ్యి దానిలో సరిగ్గా 11:11 నిమిషాలకు అమరావతి చట్టబద్ధత బిల్లును ప్రవేశ పెట్టడం తదుపరి సభలో పాల్గొన్న కూటమి పార్టీల సభ్యుల ద్వారా బిల్లును ఆమోదించడం జరిగింది. ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ‘అమరావతి రాజధాని బిల్లు నేడు ఢిల్లీకి చేరుకుంటుంది. ఏప్రిల్ 1వ తేదీన కేంద్ర మంత్రివర్గం ఈ బిల్లుపై చర్చించి, ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. ఏప్రిల్ 2వ తేదీన ఈ కీలక బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెడతారు. అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ సభ్యులు హాజరు కాలేదు. వారు సభకు రాకపోవడం చూస్తుంటే అమరావతిపై వారికి ఉన్న చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతోంది. పార్లమెంట్‌లో ఈ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు వైసీపీ ఎంపీలు ఏం చేస్తారో చూడాలి?.అని లోకేశ్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *