సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అమరావతిలోని సీఆర్డీయే కార్యాలయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ( Chandrababu ) నేడు, సోమవారం భూములిచ్చిన రైతులతో కలిసి ఉదయం 9.54 గంటలకు భవనాన్ని ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చాక అమరావతి రాజధాని పనులు పునః ప్రారంభం అయ్యాక ప్రారంభమైన తొలి ప్రభుత్వ భవనం ఇది. పైగా అమరావతి లో 250 కోట్ల తో నిర్మించిన తోలి శాశ్వత భవనం కూడా ఇదే కావడం గమనార్హం..భవనాన్ని ప్రారంభించిన అనంతరం. భవన నిర్మాణ తీరును మంత్రి నారాయణతో కలసి చంద్రబాబు పరిశీలించారు. ఇదే ప్రాంతంలో G+7 భవనంతో పాటు మరో నాలుగు పీఈబీ భవనాలను ప్రభుత్వం నిర్మించింది. సీఆర్డీయే, ఏడీసీఎల్‌తో ( AP CRDA)పాటు మున్సిపల్ శాఖకు సంబంధించిన అన్ని విభాగాలు ఒకే చోట నుంచి కార్యకలాపాలు నిర్వహించేలా నిర్మాణాలు పూర్తీ చేసారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, పలువురు కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *