సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వైసీపీ పాలనలో అర్ధాంతరంగా ఆగిపోయిన అమరావతి రాజధాని పనులు ఇటీవల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్ఛోక తిరిగి ఊపందు కున్నాయి. భారీ నిర్మాణాలకు వేల కోట్ల నిధులు సమీకరణాలు జరుగుతున్నా నేపథ్యంలో ప్రధాని మోడీ మరోసారి అమరావతి వచ్చి రాజధాని పనులు పునః ప్రారంభించే కార్యక్రమానికి హాజరు కానున్నారు. షెడ్యూలు ఖరారు వచ్చే మే 2వ తేదీన సాయంత్రం 4గంటల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి కి చేరుకుంటారు. అక్కడ సీఎం చంద్రబాబు, డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కల్సి రాజధాని పనులు పున: ప్రారంభిస్తారు. మోదీ రాక సందర్భంగా భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. సచివాలయం వెనుక ప్రాంతంలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు.
