సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అమరావతి రాజధాని కోసం మొదటి విడుత 32వేలు ఎకరాల భూములు సేకరించినప్పటికీ వాటిలో నిర్మాణాలు రోడ్డులు ఇంకా పూర్తీ కాలేదు, అయితే రాజధాని కోసం ఇంకా ’16 వేల ఎకరాలు’ కావాలని చంద్రబాబు సర్కార్ ఆదేశాలలో రెండో విడతలో ముందుగా మరో 7వేల ఎకరాల భూసేకరణ కోసం రెండో విడత ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ నేడు, గురువారం ప్రారంభమైంది. ఇందులో భాగంగా అమరావతి మండలం యండ్రాయిలో గ్రామ సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ (Minister Narayana), ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పాల్గొన్నారు. అమరావతి మండలంలో నాలుగు గ్రామాలకు చెందిన రైతుల నుంచి అధికారులు భూమిని సేకరణ ప్రారంభించారు. నేడు, యండ్రాయి గ్రామంలో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను అధికారులు మొదలుపెట్టారు. ఈ సందర్భంగా స్థానిక రైతు నంబూరి బలరాం 4 ఎకరాల భూముని ఇచ్చారు. ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ సమక్షంలో మంత్రి నారాయణకు పొలం పత్రాలను అందజేశారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ గత జగన్ హయాంలో వైసీపీ ప్రభుత్వం గుత్తేదారులకు బిల్లులు చెల్లించకపోవడంతో రాజధాని నిర్మాణం ఆలస్యమైందని విమర్శించారు. రెండో విడతలో రైతులు ఇచ్చే 7000 పైగా ఎకరాల భూముల్లో నాలుగు, ఆరు లైన్ల రహదారి నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించామని. 2500 ఎకరాలలో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు చేయనున్నామని ప్రకటించారు.
