సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుకు జగన్ సర్కార్ ఫై వినూత్న నిరసనలతో టీడీపీ పార్టీ కోసం, స్థానికంగా ప్రజల కోసం కష్టపడే గుణం ఉందని రాజకీయాలకు అతీతంగా పలువురు ఏకీభవిస్తారు. అయితే భీమవరం నియోజకవర్గం వీరవాసరం నుండి పాలకొల్లు పరిధిలోని కవిటం, పోడూరు ప్రాంతాలలో అమరావతి రైతుల సంఘీభావం పేరుతొ కొందరు టీడీపీ నేతలు ప్రధాన రోడ్లను పాదయాత్ర ను ధర్నాల తరహాలో నిర్వహించడంవల్ల..గంటల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోయి వర్షంలో ముద్దవుతున్న వాహనదారులు, బస్సు ప్రయాణికులు తీవ్ర అసహనంతో రగిలిపోయిన నేపథ్యంలో పలు ఘర్షణలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో ఆర్టీసీ బస్సు లో మహిళలపై పాలకొల్లు టీడీపీ ఎమ్మె ల్యే నిమ్మ ల రామానాయుడు దూకుడు ప్రవర్తన తాజగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విషయంలోకి వెళితే.. పాలకొల్లునుంచి పెనుగొండ రోడ్డు మార్గంలో ఓ ఆర్టీసీ బస్సు ఎక్కిన ‘నిమ్మల రామానాయుడు’.. ప్రయాణికులతో మాట్లాడుతూ సీఎం జగన్ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలపైన విమర్శలు చేస్తున్నారు. అసలే బస్సు ఆగిపోయి మంటమీద ఉన్న బస్సులో ఒక మహిళా సీఎం జగన్ సంక్షేమ పథకాలు బాగా అమలుచేస్తున్నారని, మీ పద్దతే బాగోలేదని వాదించడంతో ఎమ్మెల్యే అవాక్కయ్యా రు. దీంతో, ఆగ్రహంతో మాట్లాడుతూ ఎమ్మెల్యే రామానాయుడు ఆ మహిళ చేతిలోని సెల్ఫోన్ బలవంతంగా లాక్కున్నారు. దానిని పక్క నే ఉన్న మరో టీడీపీ నేతకు ఇవ్వడంతో,.ఆ మహిళ ఒక్కసారిగా లంఘించి ఎమ్మె ల్యే మెడలోని పచ్చ కండువాను, చొక్కా ను లాగడంతో నివ్వెరపోయిన ఎమ్మెల్యే కేకలు వేయడం ఆ వీడియోలో స్పష్టంగా రికార్డయ్యాయి. కవిటం లాకుల వద్ద కూడా ట్రాఫిక్ ఆగిపోవడంతో బస్సు ప్రయాణికుల నుం చి పాదయాత్రలోని మాజీమం త్రి పితాని, ఎమ్మె ల్యే నిమ్మ ల ను ఒక్క బసు ప్రయాణికుడు బస్సు బయటకు వచ్చి వారిపై మండిపడ్డాడు. ఎందుకు ట్రాఫిక్ ఆపేసారు.? గతంలో చం ద్రబాబు రాష్ట్రానికి చేసిన మోసం చాలదా? ఇప్పు డు రైతుల ముసుగులో మీరు పాదయాత్ర ఎందుకు? అంటూ టీడీపీ నేతలను నిలదీశాడు. దానితో టీడీపీ వర్గాలు కూడా దానిపై ఆగ్రహం వ్యక్తం చేసాయి.
