సిగ్మాతెలుగు డాట్,ఇన్ న్యూస్: తాజా వార్త సమాచారం ప్రకారం.. అమరావతి రైతుల పాదయాత్రపై నేడు, బుధవారం హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. పాదయాత్రలో ముందు రైతులున్నప్పటికీ వెనుక వేరేవాళ్లు ఉన్నారని కోర్టు వ్యాఖ్యానించింది. 600 మంది రైతులకే పాదయాత్ర పరిమితం చేసినప్పటికీ ఇంకా కోర్టులపైనా ఒత్తిడి తెస్తారా? అంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అమరావతి పాదయాత్ర రైతులకే పరిమితం చెయ్యాలని రాజకీయ యాత్ర కాదని, అసలు పిటిషన్లో పార్టీ కానివారు హైకోర్టు కు అప్పీల్ ఎలా దాఖలు చేస్తారంటూ రాజధాని రైతు పరిరక్షణసమితిని హైకోర్టు ప్రశ్నించింది. రాజధాని రైతు పరిరక్షణ సమితి దాఖలు చేసిన పిటిషన్ విచారణ అర్హతపై అభ్యం తరం లేవనెత్తిన రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు కోరినట్లు పూర్తీ సమాచారంతో కౌంటర్ దాఖలు చేస్తామని ధర్మాసనానికి తెలిపింది. దీంతో తదుపరి విచారణను కోర్టు సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
