సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అమరావతి రైతులు చేస్తున్న మహా పాదయాత్ర నేడు, శుక్రవారం భీమవరం లో ప్రవేశించడంతో వారికీ మద్దతుగా భీమవరం పట్టణంలో నేటి శుక్రవారం ఉదయం భారీ వర్షంలో సైతం సిపిఎం ప్రదర్శన నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రకాశం చౌక్ లో జరిగిన సభలో సిపిఎం పశ్చిమగోదావరి జిల్లా కార్యదర్శి బి.బలరాం మాట్లాడుతూ.. అందరూ అన్ని రాజకీయ పార్టీలు ఆనాడు ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకు, చేసిన శంకుస్థాపనలను దృష్టిలో ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నడిబొడ్డున సౌకర్యంగా ఉండే విధంగా నిర్ణయించిన అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన హామీలు రాష్ట్రానికి ఇచ్చిన హామీలు మేరకు కేంద్ర ప్రభుత్వం రాజధానికి నిర్మాణానికి నిధులు, ప్రత్యేక హోదా ఇవ్వాలని, విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని, కడపలో ఉక్కు ఫ్యాక్టరీని నిర్మించాలని, రాష్ట్రంనకు ప్రతిష్టాకరమైన ప్రభుత్వ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అమ్మకమును కేంద్రం ఆపాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్ఢ సభ్యులు జేఎన్వి గోపాలన్, కలిదిండి రాజా రామ్మోహన్ రాయ్, బి వాసుదేవరావు, గొర్ల రామకృష్ణ, ఎం వైకుంఠం, చెల్లబోయిన వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *