సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు గురువారం ఢిల్లీలో ప్రధాని మోడీ అడ్జక్షతన కేంద్ర కేబినెట్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. ముఖ్యంగా అంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కి రైల్వే ప్రాజెక్ట్ లకు మోడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.. విజయవాడ, గుంటూరు, తెనాలి మార్గాన్ని అనుసందానిస్తూ అమరావతి రైల్వే లైన్ ను నిర్మించనున్నారు..ఇక ఎర్రుపాలెం కృష్ణా నదిపై రైలు వంతెన నిర్మించేందుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.. మొత్తం 3.2 కిలోమీటర్ల రైల్వే వంతెన తో పాటు 57 కిలోమీటర్ల రైల్వే లైన నిర్మాణ కోసం రెండు వేల 245 కోట్లు ఖర్చు చేయనున్నారు.. ఈ రైల్వై లైన్ ఏర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు నిర్మించనున్నారు.ఈ రైల్వే లైన్‌తో దక్షిణ, మధ్య, ఉత్తర భారత్‌తో అనుసంధానం మరింత సులువు కానుంది. అమరావతి స్తూపం, ఉండవల్లి గుహలు, అమరలింగేశ్వరస్వామి ఆలయం, ధ్యానబుద్ధ ప్రాజెక్టుకు వెళ్లే వారికి సులువైన మార్గంగా అభివృద్ధి చేయనున్నారు. మచిలీపట్నం, కృష్ణపట్నం, కాకినాడ పోర్టులను అనుసంధానిస్తూ ఈ రైల్వేలైన్ ఏర్పాటు కానుంది. అమరావతి రైల్వే లైన్‌కు రూ.2,245 కోట్లు నిధులు కేటాయించింది.
