సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ రాజధాని అమరావతి రైలుమార్గంలో కృష్ణానదిపై కొత్తగా ఏర్పాటుచేసే రైలు బ్రిడ్జి ఐకానిక్‌గా ఉండేలా చూడాలని కేంద్రాన్ని సీఎం చంద్రబాబు కోరారు. రైల్వేలైన్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ తో ఆన్‌లైన్‌లోమాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ,, అమరావతి రైలుమార్గం కోసం అవసరమైన భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం తరపున సంపూర్ణ సహకారం అందిస్తామని అశ్వినీ వైష్ణవ్‌కు హామీఇచ్చారు. అమరావతి రైల్వే లైన్‌ను మూడేళ్లలో పూర్తి చేయండి..ఇప్పటికే భూసేకరణకు నోటిఫికేషన్లు కూడా జారీ చేశామన్నారు. దీని దృష్ట్యా ప్రాజెక్టును మూడేళ్లలోనే పూర్తి చేయగలిగితే అందరికీ మేలు జరుగుతుందని చంద్రబాబు అన్నారు. అలానే వచ్చే నవంబరు/డిసెంబరు నెలల్లో ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధానమంత్రిని హాజరయ్యేలా చూడాలని కేంద్ర రైల్వే మంత్రిని చంద్రబాబు కోరారు. రాజధానికి రైల్వే కనెక్టివిటీ వల్ల దేశంలోని అన్నీ రాజధానులను అనుసంధానం చేసేందుకు వీలు కలుగుతుందని అభిప్రాయపడ్డారు.
