సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్ : సీఎం జగన్ అమరావతి రాజధాని ప్రాంతం కృష్ణాయపాలెం లో నేడు, సోమవారం పేదలకు సుమారు 50వేల ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి.. పట్టాలు అందించి.. వాటిలో నిర్మించనున్న అన్ని వసతుల మోడల్ హౌస్ లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేసారు. . అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతూ.. ‘‘ఇవాళ రాష్ట్ర చరిత్రలోనే ప్రత్యేకంగా నిలిచిపోయే రోజు. నా ఎస్సీ, ఎస్టీ, స్టీ బీసీ, మైనారిటీలు.. పేదలం దరికీ ఈరోజు మరిచిపోలేనిది. పేదల శత్రువులపై పేదలు సాధించిన విజయం ఇది. ఇళ్లు కట్టిస్తానని గతంలో చంద్రబాబు మోసం చేశారు. పేదవాడికి ఇల్లు రాకూడదని.. అడ్డుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. దీనికోసం సుప్రీం కోర్టు దాకా వెళ్లి మరీ ప్రయత్నించారు. ఇలాంటి పరిస్థితి మరెక్క డా రాకూడదు’’..ఇవాళ పేదల విజయం గా ఈ కార్యక్రమం జరుగుతోంది. ఇక్కడ పేదల ఇల్లు నిర్మాణం ఆపడానికి 18 కేసులు వేశారు. మూడేళ్ల తరపున మీ కోసం పోరాటం చేశాం. విజయం సాధించాం, అందుకే.. ఇది పెత్తం దారుల మీద పేదల ప్రభుత్వం సాధించిన విజయం.ఒక చంద్రబాబు, మీడియా దుష్ట చతుష్టయం ఒక దత్తపుత్రులు.. వీళ్లకు తోడు చంద్రబాబు పుట్టించిన ఊరు-పేరు లేని సంఘాలు. వీళ్లంతా పేదవాడికి ఇల్లురాకూడదని ఎన్నో ప్రయత్నా లు చేశారు. ఇలాం టి దౌర్భా గ్య పరిస్థితి మన రాష్ట్రం లోనే చూశాం అని సీఎం జగన్ ఆవేదన వ్యక్తం చేసారు.
