సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతిని నూతన ఆవిష్కరణలకు వేదికగా తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి మేరకు అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (ఆర్‌టీఐహెచ్)ను త్వరలో ప్రారంభించనున్నారు అని సమాచారం. వచ్చే ఐదేళ్లలో 20,000 స్టార్ట్‌ప్‌లతో 1000 కోట్ల పెట్టుబడి, 1 లక్ష ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో పనిచేస్తామన్నారు.. అమరావతి కేంద్రంగా ఏర్పాటయ్యే సెంట్రల్ హబ్‌కు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను కేటాయించాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు 5 జిల్లాల్లో ఎంపిక చేసిన గ్రామ, వార్డు ఉద్యోగులకు ఇన్నోవేషన్ హబ్‌కు వెళ్లనున్నారు. ప్రభుత్వ కేటాయించిన ప్రకారం వీరిలో అమరావతి సెంట్రల్ హబ్- 30 మంది, విశాఖపట్నం- 20 మంది, రాజమండ్రి- 20 మంది, ఎన్టీఆర్- 20 మంది, తిరుపతి- 20 మంది, అనంతపురం- 20 మంది వెళ్లనున్నారు. అయితే ఈ వీరిలో ఎంబీఏ (ఫైనాన్స్), ఎంకామ్, సీఏ, ఇంజినీరింగ్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన వారిని ఇన్నోవేషన్ హబ్‌కు ఉద్యోగులుగా కేటాయించనున్నారు.
