సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: బాలీవుడ్ లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న భారీ పాన్ ఇండియా మూవీ ‘బ్రహ్మాస్త్ర’. రణబీర్ కపూర్, అమితాబ్ బచ్చన్, నాగార్జున, డింపుల్ కపాడియా, ఆలియా భట్ తదితరులు నటిస్తున్నారు. దీనిపై హైదరాబాద్ లో జరిగిన మీడియా సమావేశంలో నాగార్జున, రణబీర్ పాల్గొన్నారు. ఈ ఫాంటసీ సినిమా అని కధ పాయింట్ వివరించారు.. మన విశ్వంలో ఏదో జరుగుతోంది. అది సామాన్యుల ఊహకు కూడా అందనిది. అది అత్యంత పురాతన మహాశక్తి. అదో అస్త్రం. అదేంటి? అంటూ ‘బ్రహ్మాస్త్ర’ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ తో ప్రచారం మొదలు పెట్టారు. ఇందులో మొదటి భాగం ‘శివ’ గా వస్తోంది. రణబీర్ కపూర్ చేస్తున్న ఆ పాత్ర పరిచయం చేస్తూ ఓ మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు.ఇందులో విశ్వం నుంచి భగభగమండే అగ్ని నుంచి రణబీర్ కపూర్ లోకి ఒక శక్తి రావడం, అది త్రిశూలంగా మారడం శివుడిలా రణబీర్ కపూర్ త్రిశూలం పట్టుకొని రివీల్ అవడం ఆకట్టుకుంటోంది.ఇక సినిమా తెలుగులో ‘బ్రహ్మాస్త్రం’ గా విడుదలవుతోంది. ఈ సినిమాను మూడు పార్టులు గా విడుదల చేస్తున్నారు. . మిగతా రెండు పార్టులు ‘బ్రహ్మ, విష్ణు’ గా విడుదల కాబోతున్నాయి. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ధర్మప్రొడక్షన్స్, ఫ్యాక్స్ స్టార్ స్టూడియోస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *