సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రభాస్ హీరోగా పాన్ వరల్డ్ సినిమా రూపొందుతున్న ‘ప్రాజెక్ట్ కే ‘ సినిమా షూటింగ్ లో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ‘షూటింగ్ లో గాయపడ్డారు అనే వార్త గత 3 రోజులుగా దేశవ్యాప్తంగా ఒక పెద్ద సంచలనంగా మారింది. .. దీనిపై స్వయంగా . అమితాబ్ బచ్చన్ తరపున ఆయన బ్లాగ్ లో తనకి గాయాలు అయ్యాయని, ఇప్పట్లో షూటింగ్ కి కూడా హాజరు కావటంలేదని ‘అవధాని’ కూడా తెలిపారు. ప్రాజెక్టు కే సినిమాను ప్రముఖ నిర్మాత అశ్విని దత్ నిర్మిస్తున్న సంగతి కూడా అందరికీ తెలిసిందే. అయితే ఈ ప్రమాద వార్తలను నేడు, సోమవారం ఒక మీడియాలో మాట్లాడుతూ, నిర్మాత అశ్విని దత్ ఖండించారు.. అమితాబ్ బచ్చన్ కి ‘ప్రాజెక్ట్ కె’ షూటింగ్ సందర్భంగా ఏమీ ప్రమాదం జరగలేదని చెపుతున్నారు. “మా సినిమా షూటింగ్ లో అమితాబ్ గారికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. మూడు రోజుల క్రితం అయన షూటింగ్ చేసుకొని, బొంబాయి వెళ్లిపోయారు,” అని తేల్చేసారు. మరి అమితాబ్ బ్లాగ్ లో ఆలా వేసారేమిటి? అశ్వని దత్తు 3 రోజుల క్రిందటే ఈ వార్త ను ఖండించవచ్చు కదా? తేడాగా లేదు..
