సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గతంలో బీజేపీ తో 3సార్లు టీడీపీ పొత్తు పెట్టుకొని మంచి ఫలితాలు సాదించినప్పటికీ తరువాత పరిణామాలలో వారికీ దూరంగా జరిగిన చంద్రబాబు 2019 ఎన్నికలకు ముందయితే గతంలో ‘బీజేపీ తో పొత్తు తెలుగుదేశం పార్టీ చేసిన చారిత్రక తప్పిదం’ అని ప్రకటించిన విషయం అందరికి గుర్తే..తదుపరి తిరుపతి లో టీడీపీ కార్యకర్తలు కేంద్ర హోమ్ మినిష్టర్ ‘అమిత్ షా’ కారుపై జరిపిన దాడి తో దేశం ఉలిక్కి పడింది. అయితేనేం .. ఇటీవల బీజేపీ తో మరల పొత్తు కోసం టీడీపీ తహతహ లాడుతుందని వచ్చే ఎన్నికలలో జనసేన, టీడీపీ, బీజేపీ కలసి పొత్తుతో ఎన్నికలలోకి వెళ్ళితే మంచి ఫలితాలు ఉంటాయని భావిస్తున్న నేపథ్యంలో 2018 తరువాత తరువాత తొలిసారి.. టీడీపీ అధినేత చంద్రబాబు గత శనివారం రాత్రి 9 గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీ అయ్యారు. తర్వాత కొద్ది సేపటికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా సమావేశం లో పాల్గొన్నారు. సుమారు 45 నిమిషాలపాటు ఈ భేటీ సాగింది. గతంలో బీజేపీ తో పొత్తు వదులుకొన్నందుకు విచారం వ్యక్తం చేసి.. తదుపరి తెలుగు రాష్ట్రాల్లోపొత్తులు, ఇతరత్రా అంశాలపై బీజేపీ పెద్దలతో చంద్రబాబు చర్చించినట్లు తెలిసింది. తెలంగాణలో సీఎం కెసిఆర్ ను ఓడించాలని పట్టుతో ఉన్న బీజేపీకి అక్కడ టీడీపీ క్యాడర్ అందించే సహకారం పై చర్చ సాగినట్లు సమాచారం. తదుపరి ఏపీలో సైతం పొత్తులు కొనసాగించాలని బాబు కోరినట్లు వార్త సమాచారం. సమావేశం తదుపరి చంద్రబాబు మీడియాతో మాట్లాడకుం డానే వెళ్లిపోయారు..జగన్ ప్రభుత్వం తన హయాంలో అవినీతి, అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ చేస్తున్న పలు దర్యాపులపై జోక్యం చేసుకొని తనకు సహకరించాలని కూడా అమిత్ షా ను చంద్రబాబు కోరినట్లు వార్త కధనాలు వస్తున్నాయి.
