సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శనివారం భారత ప్రధాని మోడీ ప్రారంభించిన అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ 2 రైళ్లు సరికొత్త డిజైన్ తో మంచి, స్పీడ్‌తో వస్తున్నాయి. ‘అమృత్‌భారత్‌ ఎక్స్‌ప్రెస్‌’ రైళ్లలో ఒకటి మొదటి దశలోనే ఏపీ మీదుగా ప్రయాణం సాగిస్తుంది. గోదావరి జిల్లాలలోని ఏలూరు తుని, సామర్లకోట, రాజమండ్రి మీదుగా రాకపోకలు సాగించనుంది. రెండు అమృత్‌భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో ఒకటి ఏపీలో అడుగుపెట్టనుంది. విజయవాడ డివిజన్‌ పరిధిలో మాల్దాటౌన్‌-బెంగళూరు మధ్య ఈ రైలు ప్రయాణిస్తుంది. రద్దీగా ఉండే నగరాలకు శరవేగంగా ప్రయాణించేందుకు వీలుగా ఈ అమృత్‌భారత్‌ రైళ్లకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ నూతన రైలు విజయవాడ డివిజన్‌లో 10 రైల్వేస్టేషన్లలో మాత్రమే హోల్డ్ ఇచ్చారు... తుని, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది. ఈ ఎక్స్‌ప్రెస్‌లో సౌకర్యవంతమైన, సీట్లు, లగేజీ ర్యాక్స్‌, మొబైల్‌ హోల్డర్స్‌తో కూడిన చార్జింగ్‌ పాయింట్లు, ఎల్‌ఈడీ లైట్లు, సీసీ టీవీలు, పబ్లిక్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ వంటి సౌకర్యాలు ఉంటాయి. ఇది నాన్‌ ఏసీ స్లీపర్‌ కమ్‌ అన్‌ రిజర్వుడ్‌ క్లాస్‌ సర్వీస్‌. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరాలకు సేవలందించేలా రూపొందించబడింది. ప్రతి 50 కిలోమీటర్లు దూరానికి కేవలం 30 రూపాయల ఛార్జ్ తో ప్రయాణించే అవకాశం ఉంది. అమృత్‌భారత్‌ రైలు అనేది 22 కోచ్‌లతో ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *