సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అమృత్ భారత్ స్టేషన్ పథకం భారతీయ రైల్వేలో సరికొత్త అధ్యాయానికి నాంది:అని కేంద్ర ఉక్కు, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పేర్కొన్నారు. ఆధునికరించిన వరంగల్ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవంలో ముఖ్యఅతిథిగా పేర్కొన్నారు. నేడు, గురువారం ప్రధాని మోదీ చేతుల మీదుగా రాజస్థాన్ లోని బికినీర్ నుండి వర్చువల్ గా వరంగల్ తో సహా 103 రైల్వేస్టేషన్ల ప్రారంభం అవ్వడం గర్వకారణం అన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అమృత్ భారత్ పథకంలో 25.41 కోట్లతో ఆధునికరించిన వరంగల్ రైల్వే స్టేషన్ పునఃప్రారంభించడం, కాకతీయుల కళలు ఉట్టిపడేలా వరంగల్ రైల్వే స్టేషన్ తీర్చిదిద్దడం ఆనందంగా ఉందన్నారు, ఈ కార్యక్రమంలో తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ,ఎంపీ లు డీకే అరుణ,ఈటల రాజేందర్, కడియం కావ్య, నగర మేయర్గుండు సుధారాణి, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, ఎమ్మెల్యే లు కే ఆర్ నాగరాజు, నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, యశస్విని రెడ్డి, కుడా ఛైర్మెన్ ఇనుగాల వెంకట్రాం రెడ్డి, జిల్లా కలెక్టర్ డా.సత్య శారద, రైల్వే అధికారులు పాల్గొన్నారు.
