సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రష్యాతో చమురు కొనుగోలు చేస్తున్నామనే వంక చూపించి భారత్ పై అమెరికా 50 శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. ట్రంప్ తీరును ఇండియా సీరియస్ గానే తీసుకుంది. రష్యా తో పాటు చైనా తో బంధం మరింత బలోపేతం చేసుకొంటుంది. అమెరికాకు వెళ్లే విమానయాన సంస్థలు ఆగస్టు 25 తర్వాత సరుకులను స్వీకరించలేమని భారత అధికారులకు తెలియజేశాయి. దీనితో తాజాగా నేడు, శనివారం అమెరికాకు భారత్ షాక్ ఇచ్చింది. అమెరికాకు పోస్టల్ సేవల్ నిలిపివేయనుంది.ఈ నెల చివరలో అమల్లోకి వచ్చే US కస్టమ్స్ నిబంధనలలో మార్పులను పేర్కొంటూ ఆగస్టు 25 నుండి అమెరికాకు అన్ని పోస్టల్ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తపాలా శాఖ నేడు, శనివారం ప్రకటించింది.100 USD వరకు విలువైన లేఖలు,పత్రాలు, బహుమతి వస్తువులు తప్ప” అని పత్రికా ప్రకటనలో తెలిపింది.
