సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమాసియాలో గత 5 రోజులుగా యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి.ఇరాన్- అమెరికా,ఇజ్రాయెల్ మధ్య మొదలైన పోరు..నేడు బుధవారం ఐదో రోజు భీకరంగా మారింది.ఒకవైపు టెహ్రాన్ నగరంలో అమెరికా B2 బాంబర్లు మృత్యుఘోష వినిపిస్తుంటే, మరోవైపు ఇరాన్ తన సూపర్ సోనిక్ మిస్సైళ్లతో టెల్ అవీవ్‌ను వణికిస్తోంది. దెబ్బ తిన్న సింహంలా ఇరాన్ అమెరికా కు సహకరిస్తున్నగల్ఫ్ దేశాలపై మిసైల్స్ వర్షం కురిపిస్తున్న తీరు. ఇజ్రాయిల్ పై మిసైల్ దాడులు అన్నిచోట్లా ఆస్థి , జన నష్టాలతో, వేలాది విమానాలు స్తంభించిపోవడం ప్రతిరోజూ ప్రపంచానికి జరుగుతున్నా లక్షల కోట్ల నష్టం. స్టాక్ మార్కెట్ అతలాకుతలం ప్రపంచాన్ని కలవర పెడుతుంది. అయితే ఈ ఉత్పాతం తెచ్చిన అమెరికా ప్రసిడెంట్ ట్రంప్ ఇరాన్ ఆయుధ బలాన్ని సైన్యం, సాంకేతిక సమర్ధత ను తప్పదు లెక్క కట్టడాన్ని నిరూపిస్తుంది. తాజగా సముద్ర గర్భంలో అమెరికా యుద్ధ నౌకపై ఇరాన్ చేసిన ప్రతీకార దాడితో ఈ యుద్ధం మహా సంగ్రామంగా మారింది.ఇక ఇరాన్ ను ఉపేక్షించబోమని అమెరికా సత్తా ను తట్టుకోలేదని,ఇజ్రాయెల్‌ను నాశనం చేయాలనుకొనేవారిని వదిలిపెట్టమని ట్రంప్ వ్యాఖ్యలకు దీటుగా తాజగా నేటి బుధవారం మధ్యాహ్నం చైనా స్వాదించింది. ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ తో ఫోన్ లో చైనా విదేశాంగ మంత్రి హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది. తమ మిత్ర దేశం ఇరాన్ సార్వా బొమత్వానికీ తాము అండగా ఉంటామని, అమెరికా ఇజ్రాయిల్ వెంటన ఆపకపోతే ఇరాన్ రక్షణ చైనా యుద్ధ రంగంలోకి దిగుతుందని తీవ్ర స్థాయిలో హెచ్చరిక చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *