సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రపంచంలో మరే దేశమూ లేని విధంగా భారత్ అమెరికాపై అత్యధిక సుంకాలు విధిస్తోందని.. ఇందుకు ప్రతీకారంగా తామూ అదే స్థాయిలో మేమూ వసూలు చేస్తామని గతంలోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఇండియాను టారిఫ్ కింగ్‌గా అభివర్ణించారు, భారత్ చైనా రెండు దేశాలకు ఏప్రిల్ 2వ తేదీని గడువుగా విధించారు. తన డిమాండ్ తో భారత్ దిగి వచ్చిందని అమెరికా నుండి దిగుమతులపై టాక్స్ లు తగ్గిస్తుందని తాజగా ట్రాంప్ ప్రకటించడం పట్ల భారత్ విదేశీ వాణిజ్య శాఖ స్వందించింది , నిజానికి, అమెరికాకు భారత్ అతి పెద్ద వాణిజ్య భాగస్వామి. గత ఆర్థిక సంవత్సరం ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 118.2 బిలియన్ డాలర్లకు చేరుకుంది. 2030 నాటికి 500 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని సాధించాలనే దీర్ఘకాలిక లక్ష్యంతో ముందుకుసాగుతోంది. ఈ సంవత్సరం చివరి నాటికి పరస్పరం ప్రయోజనకరమైన బహుళ రంగాల ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (BTA)మొదటి దశపై చర్చలు జరపడానికి గత నెలలో రెండు దేశాలు అంగీకరించాయి. దీనిలో భాగంగా టాక్స్ లు తగ్గించమని అంతే కానీ . ట్రంప్ ఒత్తిడికి భయపడి ఈ చర్యలు తీసుకోలేదని భారత ప్రభుత్వ ఉన్నతాధికారులు ప్రకటించారు. గతంలో, భారతదేశం అనేక ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాల కింద ఆస్ట్రేలియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, స్విట్జర్లాండ్, నార్వే వంటి దేశాలకు కూడా సగటు వర్తించే సుంకాలను తగ్గించింది. ప్రస్తుతం యూరోపియన్ యూనియన్, UKతో కూడా ఇలాంటి ఒప్పందాల ఫై చర్చలు నడుస్తున్నాయని ఉదహరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *