సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అమెరికా ఒకటి కొడితే ఇజ్రాయిల్ తో పాటు అమెరికా సైన్యానికి ఆశ్రయం ఇస్తున్న గల్ఫ్ దేశాలలో 8 చోట్ల కొడతాం.. అన్న తీరులో తన సత్తా చాటుతున్న ఇరాన్ ఇక తాడో పేడో తేల్చేస్తాం అంటుంది. పరోక్షంగా అమెరికా లో కోట్ల మంది ప్రజల నిరసనలతో ట్రంప్ ప్రెసిడెంట్ కుర్చీ కి ఎసరు పెడుతుంది. తాజగా ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో 48 గంటల కాల్పుల విరమణ కోసం అమెరికా చేసిన తాజా ప్రతిపాదనను మరియు చర్చల కోసం కోసం ‘పాకిస్థాన్ మధ్యవర్తిత్వం’ వహించడాన్ని కూడా ఇరాన్ తిరస్కరించిందని వార్తలు వస్తున్నాయి. గత బుధవారం ఒక మధ్యవర్తి దేశం ద్వారా ఇరాన్‌కు అమెరికా ఈ సందేశం పంపినట్టు సమాచారం. అమెరికాకు చెందిన రెండు అత్యాధునిక ఫైటర్ జెట్లను కూల్చేసినట్టు ఇరాన్ ప్రకటించింది. అమెరికాగర్వముగా చెప్పకొనే వందల కోట్ల విలువైన ఎఫ్-15 యుద్ధ విమానానికి చెందిన ఫొటోలను ఇరాన్ మీడియా విడుదల చేసింది .మొత్తంగా మూడో ఎఫ్-35ని అమెరికా నష్టపోయిందని,పైలెట్ ను బందించామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ పేర్కొంది. కూలిపోయిన యుద్ధ విమానం శకలాలను, పైలట్లను గుర్తించేందుకు అమెరికా బ్లాక్ హాక్ హెలికాప్టర్, సీ-130 హెర్క్యులస్ విమానాలతో గాలింపు చేపట్టింది. ఈ క్రమంలో వాటిపైనా ఇరాన్ డ్రోన్లు, యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ క్షిపణులను ప్రయోగించింది.హెలికాప్టర్ ను కూడా కూల్చేసినట్లు ఇరాన్ ప్రకటించింది.
