సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్:అమెరికాతో వాణిజ్య ఒప్పందం, కేంద్ర బడ్జెట్‌పై జరుగుతున్నా చర్చ నేపథ్యంలో ..నేడు బుధవారం లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు ఘాటు వ్యాఖ్యలు చేసారు.. అమెరికాతో ట్రేడ్ డీల్‌తో భారత్ లోని 140 కోట్ల ప్రజానీకం భవిష్యత్తును, రైతుల ప్రయోజనాలు పణంగా పెట్టారని ఆరోపించారు.అమెరికా దిగుమతులు 46 బిలియన్ డాలర్ల నుంచి 146 బిలియన్ డాలర్లకుపెరుగుతాయి. మనకు మాత్రం ఎలాంటి కమిట్‌మెంట్ ఇవ్వలేదు. మనం మాత్రం వారికి కమిట్‌మెంట్ ఇచ్చాం. మనం ఫూల్స్‌లా నిలబడ్డాం’ ఇది సిగ్గు చెటయిన ఒప్పందంఅని, దేశాన్ని అమ్మేశారని అన్నారు. ఇరాన్ నుంచో లేదా మిత్ర దేశం రష్యా నుండి చౌక గా లభిస్తున్న చమురు అమెరికా కు భయపడి ఎందుకు నిలుపుదల చేస్తున్నారు? ‘మనం చమురు ఎక్కడ నుంచి కొంటామో? అమెరికా నిర్ణయిస్తుందా?అమెరికా ఆధిపత్యాన్ని, డాలర్ ఆధిపత్యాన్ని చైనా, రష్యావంటి శక్తులు సవాలు చేస్తున్నాయి. అయితే ప్రధాని మోడీ మాత్రం ట్రేడ్ డీల్ పేరుతో మీరు పూర్తిగా లొంగిపోయారు’ అని మండి పడ్డారు. ప్రస్తుతం పార్లమెంటుకు ప్రధాని మోదీ ముఖం చాటేయడం ఎలాంటి ఆశ్చర్యం కలిగించడం లేదు‘ అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *