సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నా అమెరికాతో భారత్ ట్రేడ్ డీల్ కుదరడం దేశీయ సూచీలకు భారీ లాభాలను అందిస్తోంది. భారత్ ఎగుమతులపై అమెరికా పన్నులు భారీగా తగ్గడం మదుపర్లలో ఉత్సాహాన్ని నింపింది. తాజాగా భారత్‌పై సుంకాలను 50 నుంచి 18 శాతానికి తగ్గించింది. దీంతో భారత్ పైనే అమెరికా సుంకాలు మిగతా దేశాలతో పోలిస్తే తక్కువగా ఉన్నాయి. మరోవైపు రూపాయి కూడా బలపడుతోంది. ఈ పరిణామాలతో ఈ రోజు సెన్సెక్స్ 3500 పాయింట్ల లాభంతో మొదలైంది. మరోవైపు నిఫ్టీ కూడా జోరు చూపిస్తోంది. గత కొద్ది రోజులుగా నేల చూపులు చూసిన సూచీలు భారీగా లాభపడుతున్నాయి . గత సెషన్ ముగింపు (81,666)తో పోల్చుకుంటే మంగళవారం ఉదయం దాదాపు 3500 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ జోరు చూపిస్తోంది. చాలా రోజుల తర్వాత 85 వేల మార్క్ దాటింది. అయితే ఆ తర్వాత అమ్మకాల కారణంగా కిందకు దిగి వచ్చింది. ప్రస్తుతం ఉదయం 9:45 గంటల సమయంలో సెన్సెక్స్ 2143 పాయింట్ల లాభంతో 83,809 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ 649 పాయింట్ల లాభంతో 25,737 వద్ద కదలాడుతోంది.నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 1561 పాయింట్ల లాభంతో ఉంది. బ్యాంక్ నిఫ్టీ 13528 పాయింట్ల లాభంతో ఉంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 90.36గా ఉంది.
