సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రోజుకో సంచలన నిర్ణయాలు అమలుపరుస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న హడావిడి అంతాఇంతా కాదు. తన పర తేడాలేకుండా విదేశీ దిగుమతులపై వేస్తున్న భారీ సుంకాలు అమెరికాకు మిత్ర దేశాలు కూడా దూరం అవుతున్నాయి. ట్రంప్ వేస్తున్న సుంకాలను ప్రతీకారంగా అమెరికా దిగుమతులపై చైనా తదితర దేశాలు వేసున్న అదనపు టాక్స్ ల దెబ్బకు అటు తిరిగి ఇటు తిరిగి అమెరికాలో నిత్యావసర ధరలు పెరిగిపోతుండటంతో పాటు అమెరికా ఎగుమతులపై అక్కడి వ్యాపార దిగ్గజ కంపెనీ ల ఆర్ధిక అభివృద్ధి క్షిణించిపోతుంది. అమెరికా దీర్ఘ కాలిక ప్రయోజనాలు సాదిస్తుందని తిరిగి ధనిక దేశం అవుతుందని ఓపిక పట్టాలని ట్రంప్ చేస్తున్న విజ్ఞప్తులు ప్రజలకు పట్టడం లేదు. ట్రంప్ అనూహ్య నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు నిరసనలు చేపడుతున్నారు. వేలాది మంది అమెరికన్లు ‘హ్యాండ్సాఫ్’ పేరుతో ఆందోళనకు దిగారు. నార్త్ కరోలినా, మసాచుసెట్స్ , వాషిం గ్టన్ డీసీ సహా పలు చోట్ల నిరసనల్లో పాల్గొన్నారు. అమెరికా ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాల కోత, అధిక ధరలు, మానవ హక్కులు, ఇతర అంశాలపై నిరసనలు వెల్లువెత్తున్నాయి.
