సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అమెరికాలోని డెట్రాయిట్ లో జరుగుతున్న “ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA)”తానా వారి 24వ మహాసభలలో ముఖ్య అతిధిగా పాల్గొన్న శాసనసభ డిప్యూటీ స్పీకర్ మరియు ఉండి ఎమ్మెల్యే , రఘురామకృష్ణ రాజు పాల్గొన్నారు. అమెరికా లో మన తెలుగువారు ఇంత ఉన్నత అభివృద్ధి సాధించడమే కాకుండా మన తెలుగు సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకొంటూ భావి తరాలకు అందించే కార్యక్రమం ప్రతి ఏటా చేపట్టడం .. మన తెలుగు రాష్ట్రాల ప్రముఖులను ఇక్కడకు ఆహ్వానించి గౌరవించడం అభినందనీయం అన్నారు. ఆయనతో పాటు ఆచంట ఎమెల్య పితాని సత్యనారాయణ, నటుడు మురళి మోహన్ , మైత్రి మూవీస్ అధినేతలు తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *