సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆహ్వానం మేరకు.. అమెరికాలో పర్యటిస్తున్న భారత ప్రధాని మోదీ ట్విట్టర్ సీఈవో.. ఎలాన్ మస్క్‌తో తాజాగా భేటీ అయ్యారు. ఈ భేటీలో ఇరువురు పలు కీలక విషయాలపై చర్చించారు. భేటీ అనంతరం భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది తాను భారత్‌లో పర్యటిస్తానని ఎలాన్ మస్క్ తెలిపారు. తనకు తాను మోదీకి అభిమానినని ఎలాన్ మస్క్ చెప్పారు. ప్రధాని మోదీ భారత్ అభివృద్ధిలో ప్రత్యేక దృష్టి సారించారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. మేం సరైన సమయంలో భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని ఎలాన్ మస్క్ ప్రకటించారు. ప్రధాని మోడీ అమెరికా పర్యటన ఈనెల 24వరకు కొనసాగుతుంది.
