సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రపంచానికి పెద్దన్న గా నిర్ణయాలు తీసుకొనే అమెరికా వైట్ హౌస్ ( white house)దగ్గర గార్డులపై ఒక ఆగంతకుడు జరిపిన కాల్పుల ఘటన ప్రపంచాన్నీ నివ్వెరపరచింది. కాగా, స్థానిక భారత కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు ఒక వ్యక్తి నేషనల్ గార్డ్స్ మీద కాల్పులు జరిపాడు. వైట్ హౌస్‌కు అతి సమీపంలో రద్దీగా ఉండే ఫారగుట్ స్క్వేర్ ప్రాంతంలో ఈ కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి తీవ్ర విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కాల్పులకు పాల్పడిన అనుమానితుడిని ఆఫ్ఘన్ జాతీయుడు రహ్మానుల్లా లకన్వాల్‌గా అధికారులు గుర్తించారు. ఇతను 2021లో అమెరికాలోకి ప్రవేశించినట్లు చెబుతున్నారు. అమెరికా వాషింగ్టన్ డీసీలో నేషనల్ గార్డ్ పోలీసులపై జరిపిన కాల్పులను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఖండించారు. దుష్టమూకలు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *