సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఇటీవల చైనాకు చెందిన ఓ అనుమానిత బెలూన్ ను ఇటీవల అమెరికా ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. తరువాత ఇటీవల అమెరికా గగనతలం లో వేగంగా కదులుతున్న వస్తువుల కదలికలు వాటిలో కొన్నింటిని అమెరికా సేనలు జనావాసాలకు దూరంగా కూల్చివేయడం ఫై వస్తున్నా వార్తలు అవి అంతరిక్షం నుండి వస్తున్నా గ్రహాంతర వాసుల ప్లేయింగ్ సాసర్స్ ఏమో? అని ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. వరుసగా గత ఆదివారం, మూడో రోజు నింగిలో ఎగురుతున్న గుర్తుతెలియని వస్తువును అగ్రరాజ్యం కూల్చేసింది. మిచిగాన్ లోని హ్యూ రన్ సరస్సుపై 20వేల అడుగుల ఎత్తులో కన్పించిన ఆ వస్తువును ఎఫ్-16 యుద్ధవిమానం తో కూల్చేసినట్లు పెంటగాన్ మీడియా కార్యదర్శి బ్రిగేడియర్ జనరల్ పాట్రిక్ రైడర్ తాజగా ధ్రువీకరించారు. గత శుక్రవారం అలస్కా లో, శనివారం కెనడాలోని యూకాన్ ప్రాంతంలో ఈ గుర్తుతెలియని వస్తువులు కన్పించగా అధ్యక్షుడు జో బైడెన్ అనుమతితో అమెరికా మిలిటరీ వాటిని కూల్చేసింది. తాజాగా మిచిగాన్ రాష్ట్రంలో కూల్చి వేత జరిగింది. ప్రస్తుతం అమెరికా మిలిటరీ ఆ వస్తువుల శకలాలను స్వాధీనం చేసుకునే పనిలో ఉంది. ఏలియన్స్ వస్తున్నాయా? అని మీడియా ఉత్తర అమెరికా గగనతలాన్ని పర్యవేక్షించే యూఎస్ ఎయిర్ఫోర్స్ జనరల్ గ్లెన్ వాన్హెర్క్ను ప్రశ్నించగా.. ఆ అనుమానాలను కొట్టిపారేయలేమని ఆయన సమాధానమివ్వడం జరిగింది. అయితే అవి బెలూన్లు అని కాకుండా కచ్చితంగా వస్తువులనే చెప్పగలం ఇంటెలిజెన్స్ నిపుణులు వాటిని గుర్తిస్తారు. అయితే వీటి వెనుక ఎలాంటి అనుమానాలనూ ప్రస్తుతానికి కొట్టిపారేయలేం ’’ అని వాన్హెర్క్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *