సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ‘అతని కంటే ఘనుడు ఆచంట మల్లన్న’ సామెత తరహాలో .. ఇరాన్ గత ఆదివారంనాడు జరిపిన క్షిపణి దాడుల్లో ఇజ్రాయిల్ లోని టెల్ అవివ్ (Tel Aviv)లోని అమెరికా రాయబార కార్యాలయం భవంతి బాగా దెబ్బతినడంతో తాత్కాలికంగా మూసివేశారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్‌లో అమెరికా ( america ) రాయబారి మైక్ మకబి నేడు, సోమవారంనాడు ధ్రువీకరించారు. ఈ దాడిలో యూఎస్ దౌత్య సిబ్బంది మృతి చెందడం కానీ, గాయపడటం గురించి అధికారిక సమాచారం బయటకు రాలేదు. అయితే, పేలుడు ధాటికి యూఎస్ ఎంబసీ భవంతి దెబ్బతినట్టు సోషల్ వీడియోలో పోస్ట్ చేసిన వీడియోల్లో కనిపిస్తోంది.. ఎమర్జెన్సీ ప్రోటాకాల్‌కు అనుగుణంగా ఎంబసీ సిబ్బందిని సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని అధికారులు ఆదేశాలు జారీ చేసారు.
