సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తాజగా అమెరికా స్టాక్ మార్కెట్లు (US Stock Market) ఒక సునామి వచ్చినట్లు స్టాక్స్ కుప్పకూలిపోయాయి. దీంతో మార్చి 10న రాత్రి ప్రధాన సూచీలైన నాస్‌డాక్, S&P 500 వరుసగా 4 శాతం, 2.70 శాతం పడిపోయాయి. యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడు వాణిజ్య విధానాల కారణంగా ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ఉత్పాత తీవ్రత ఇతర దేశాలలో కూడా ప్రకంపనలు సృష్టిస్తుంది. దీంతో ఆర్థిక మందగమనం వస్తుందని భావించిన పెట్టుబడిదారులు భారీగా అమ్మకాలు చేశారు. ఈ క్రమంలో ఫిబ్రవరిలో S&P 500 గరిష్ట స్థాయి నుంచి ఏకంగా $4 ట్రిలియన్ల (రూ. 349 లక్షల కోట్లు)ను కోల్పోయింది. ఈ నేసథ్యంలో భారతీయ స్టాక్ మార్కెట్ లో నేటి మంగళవారం ఉదయం సెన్సెక్స్ 371 పాయింట్ల నష్టంతో మొదలైంది. గత వారం ప్రారంభంలో వరుస నష్టాలతో 72 వేల స్థాయికి చేరుకున్న సెన్సెక్స్ ఆ తర్వాత కాస్త కోలుకుంది. అయితే మళ్లీ నష్టాల బాట పట్టింది. ప్రస్తుతం ఉదయం 9: 30 గంటల సమయంలో సెన్సెక్స్ 412 పాయింట్ల నష్టంతో 73, 706 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌లో టాటా కమ్యూనికేషన్స్, మ్యాక్స్ ఫైనాన్సియల్స్, లారస్ ల్యాబ్స్, పేటీఎమ్ షేర్లు లాభాల బాటలో సాగుతున్నాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ 583 పాయింట్ల భారీ నష్టంతో కొనసాగుతోంది. బ్యాంక్ నిఫ్టీ 424 పాయింట్ల నష్టంలో ఉంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 87.32 కు పడిపోయింది.
